TOP STORIESBreaking Newsవ్యవసాయం

Thummala : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల పైబడి రుణం ఉన్నవారికి మంత్రి తుమ్మల స్పష్టం..!

Thummala : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల పైబడి రుణం ఉన్నవారికి మంత్రి తుమ్మల స్పష్టం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోగా చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు విడుతలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారు.

సాంకేతిక కారణాలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కుటుంబ నిర్ధారణ సర్వే కూడా పూర్తి చేశారు. కాగా రెండు లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్నవారికి కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది అమలు కాలేదు.

సోమవారం గాంధీభవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది నెలల కాలంలోనే 25 వేల కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు 25 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేశామన్నారు.

రెండు లక్షల రూపాయల పైబడి రుణం ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ తెలియజేశారు. దసరా పండుగ తర్వాత రెండు లక్షల పైబడి రుణం ఉన్న రైతుల విషయంపై సమీక్ష జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, దసరా తర్వాత రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్నవారికి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

అధికారంలోకి రావాలని ఒకరు, అధికారం పోయిందని ఆందోళనలో మరొకరు బిజెపి, బీఆర్ఎస్ లు మాట్లాడుతున్నాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేశారా..? అంటూ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఆర్జీలను స్వీకరించారు. 95 అర్జీలు వచ్చాయని భూ సమస్యలు, ఉద్యోగుల, ఫైనాన్స్, ఇందిరమ్మ ఇల్లు ఇతర సమస్యల గురించి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గాంధీభవన్ కు వస్తే తమ సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు