TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!

Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!

దమ్మపేట, మనసాక్షి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావహులు గ్రామాల్లో పోటా పోటీ కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పదవులను ఆశించిన నేతలంతా ప్రజల్లో పరపతి పెంచుకోవడం కోసం పోటీ పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రతి మండలం నుంచి జడ్పిటిసిలుగా నలుగురు పోటికి సిద్దమవుతున్నారు.

ప్రతిపక్ష పార్టీ నుంచి ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ నాయకులతో పోటీ పడుతున్నారు.అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు రానున్న ఎంపిటిసి, జడ్పిటిసిల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోటాపోటీగా పరామర్శలు ఆర్థిక సహాయాలు చేస్తూ ఓటర్లతో కలిగోలుపుగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో తమకున్న ఓటు బ్యాంకు తగ్గకుండా చూడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటి ఇందిరమ్మ ఇళ్లు గ్రామాల్లో అగ్గిని రాజేశాయి.

గ్రామాల్లో అసలైన లబ్దిదారులకు ఇవ్వకుండా అనర్హులైన వారి కేటాయించడంతో గ్రామాల్లో 20 శాతం ఓటు బ్యాంకు తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతూ కార్యకర్తలతో ప్రతి గ్రామంలో పరిచయం ఉన్న నేతలను బరిలో దింపి తమ పంతం నెగ్గించుకునేందుకు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బడా లీడర్లు పోటీ పడుతున్నారు.

పరామర్శలు ఆర్థిక సహాయాలు:

పలు పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజలకు చేరువయ్యేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.ప్రతి గ్రామంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తు , ఆర్థిక సహాయాలు చేస్తూ పోటీపడుతున్నారు. గడప తొక్కిన ఇరు పార్టీల నాయకులను ఓటర్లు గౌరవంగా చూస్తూ ఫొటోలు దిగుతున్నారు.పరామర్శలు ఆర్థిక సహాయం చేసిన పొటోలు వాట్సాప్ గ్రూప్ లో పోటా పోటి గా షేర్ చేస్తున్నారు.. కానీ ఎన్నికల వేళ ఏ పార్టీని ఆదరిస్తారో వేచి చూడాల్సిందేనని పలువురు అనుకుంటున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల తో ప్రజల్లోకి కాంగ్రెస్ లీడర్లు:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. నియోజకవర్గాలకు లబ్దిదారులకు సరిపడా ఇళ్ళు రాకపోవడంతో గ్రామానికి మొదటి విడతలో 30 ఇల్లు కేటాయించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అసలైన లబ్దిదారులకు కాకుండా అనర్హులకు కేటాయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

దీంతో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వాళ్ళు సంతృప్తి తో ఉంటే ఇళ్ళు రాని లబ్దిదారులు అసంతృప్తి తో కాంగ్రెస్ పార్టీ పై గుర్రుగా ఉన్నారు.ఈ నేపథ్యంలో నే గతంలో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కి ఓటు బ్యాంకు తగ్గుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసంతృప్తి నేతలను దగ్గర చేసుకోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును బిఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

రిజర్వేషన్ల కోసం నేతల ఎదురుచూపులు:

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ లు కీలకం కానున్నాయి. దీంతో గ్రామాల్లో పరపతి కోసం ఆరాటపడుతున్న నేతలంతా రిజర్వేషన్ ల కోసం ఎదురుచూస్తున్నారు. బిసిలకు రిజర్వేషన్ 42 % కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గత కొన్ని సంవత్సరాలుగా పదవి కోసం ఆశతో ఎదురు చూస్తున్న నేతలంగా గ్రామాల్లో తమ పలుకుబడితో ఓటు బ్యాంకు ను పెంచుకుంటున్నారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలలో యువకుల ఆకట్టుకునేందుకు చందాలతో, పాటు డీజే బాక్సులు అందజేస్తున్నారు. దీంతో యువకులు స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బరిలో ఉండే ఇరు పార్టీల నేతలను కలిసి లబ్ది పొందుతున్నారు. ఏదేమైనప్పటికి రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్ లు కీలకం కానున్నాయి.

By : Shanmukh, Dammapet 

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి..!

  2. Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

  3. Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

  4. TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!

మరిన్ని వార్తలు