Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!

Miryalaguda : స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆదిత్య పాఠశాల స్కూల్ బస్సు మంగళవారం విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళుతుండగా లారీ ఢీ కొట్టింది.
ఆ సమయంలో లారీ ఢీకొనగా బస్సు డ్రైవర్ ఇరుక్కోగా స్థానికులు ప్రయత్నం చేసి బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!
-
Khammam : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. స్థలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Alumni : 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!
-
Puls Polio : తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి.. వారికి పోలియో చుక్కలు వేయించాలి..!
-
Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!









