Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్విద్య

Alumni : 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

Alumni : 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల 2005-06 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాలం తీరినప్పటికీ,విద్యార్థి దశ జ్ఞాపకాలు మాత్రం సజీవంగా నిలిచి ఉన్నాయని పాల్గొన్న వారు భావోద్వేగంగా పేర్కొన్నారు.

పట్టణంలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలుసుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. పాఠశాల రోజులలో కలసి గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పరస్పరం ఆప్యాయత స్థాయిని పంచుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు “గాజుల సవ్వడి” అనే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పూర్వ విద్యార్థులు తమ కళాప్రతిభను ప్రదర్శించి, వాతావరణాన్ని ఉత్సాహంతో నింపారు. కార్యక్రమంలో జయలక్ష్మి, లావణ్య, స్వాతి, శిల్ప, శ్రావణి, లక్ష్మి, ప్రియాంక, సునీత, భాను తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!

  2. వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!

  3. District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!

  4. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

మరిన్ని వార్తలు