Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!

District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!

నల్లగొండ, మన సాక్షి :

విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు, నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఎస్ఎల్ బిసీ కాలనీలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనకి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు సరిపోయినన్ని నిధులు మంజూరు చేసినప్పటికీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో సరైన వసతులు లేని కారణంగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆర్డీవోలు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మిఖంగా తనిఖీ చేయాలని, ఎక్కడైనా సౌకర్యాలు లోపించినట్లయితే తక్షణమే సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్స్ ద్వారా సౌకర్యాలు కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో పొరపాట్లు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

  2. Nalgonda : నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్..!

  3. కోడిపందాలపై డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్..!

  4. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితిపై వెల్లడి..!

మరిన్ని వార్తలు