Khammam : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. స్థలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Khammam : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. స్థలాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
ఖమ్మం జిల్లా, మన సాక్షి:
కొత్తగా నిర్మించనున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కావలసిన స్ధలాల సేకరణ కోసం ఆదివారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్ధాయిలో పర్యటించారు.
దేవాలయంకు సరిపడ అనువైన భూమి కోసం అధికారులతో కలిసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. నగరంలోని 15వ డివిజన్ కొత్తగూడెం, అల్లీపురం లోని ప్రభుత్వ భూములు, అత్యంత ప్రాధాన్యత కలిగిన స్ధలాల సేకరణ సాధ్యాసాధ్యాలపై మ్యాప్ లను పరిశీలన చేసి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్టాడుతూ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం కోసం పలు స్ధలాల ప్రతిపాదనలు పరిశీలించామన్నారు. టీటీడీ దేవస్ధానం ప్రాశస్త్య ప్రమాణాలకు అనుగుణంగా రహదారి సామీప్యత, ఆలయంతో పాటు ఎక్కువ సంఖ్యలో వసతి గృహాల ఏర్పాటు అనుకూలత ఆధారంగా రెండు, మూడు స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
టీటీడీ అధికారులు, స్తపతి, పండితులు ఖమ్మం నగరానికి వచ్చి ప్రతిపాదిత స్ధలాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి ఆలయంకు అనువైన భూమిని ఖరారు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో ఖమ్మం అర్డీవో నరసింహారావు, ఖమ్మం అర్భన్ తహసీల్ధార్ సైదులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!
-
Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!
-
Nalgonda : రూ.10 వడ్డీ.. రూ.50కోట్లు వసూలు.. చివరికి కటకటాల్లోకి..!
-
Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!
-
Kissing : ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభాలా.. తెలుసుకోవల్సిందే..!









