లారీని వెనక నుండి ఢీకొనడంతో మరొక లారీ డ్రైవర్ మృతి – Latest news

లారీని వెనక నుండి ఢీకొనడంతో మరొక లారీ డ్రైవర్ మృతి

అర్వపల్లి , సెప్టెంబర్ 17, మన సాక్షి : జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి మరొక లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెంది క్లీనర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంఘటన మండల పరిధిలోని బొల్లంపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగినట్టు ఎస్సై బైరెడ్డి అంజిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ALSO READ : BREAKING : కెమికల్ వ్యర్దాలు మూసి ఎడుమ కాల్వలో.. 

మణుగూరు నుండి హైదరాబాదు వెళుతున్న లారీ అరవపల్లి మండలం బొల్లంపల్లి శివారులో ఆగి ఉన్న లారీనీ వెనక నుండి ఢీ కొనడంతో లారీలో ఉన్నమునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన జీడిమంట రమేష్  మరణించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని తెలియజేస్తున్నట్లు తెలియజేశారు.