క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

Love Marriage : కలకలం రేపిన ప్రేమ వివాహం..!

Love Marriage : కలకలం రేపిన ప్రేమ వివాహం..!

తొర్రూర్, ఆగస్టు 19, మన సాక్షి :

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలంలోని
వెలికట్టే గ్రామంలో ప్రేమవివాహం పెద్ద కలకలానికి దారితీసింది. తొర్రూర్ ఎస్సై జి. ఉపేందర్ తెలిపిన ప్రకారం వెలికట్టే గ్రామానికి చెందిన కొమ్ము అజయ్, అను వ్యక్తి యేషబోయిన లావణ్య ను జూలై 23వ తేదీన ప్రేమవివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివసిస్తూ ఉన్నారు.

అయితే ఆగస్టు 18న దంపతులు ఇద్దరు అజయ్ ఇంటికి రాగా, ఈ విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు యేషబోయిన రాములు, యేషబోయిన యాకమ్మ మరియు వారి కుమారుడు సాయికుమార్, బంధువులు బత్తుల సోమయ్య, యేషబోయిన శ్రీను, యేషబోయిన సాయిలు, బత్తుల కోమలత, బత్తుల వెంకటమ్మ, పోసాని యాకమ్మ తదితరులు కర్రలు, కత్తిపీటలతో అజయ్ ఇంటిపై దాడి చేశారు.

ఈ దాడిలో అజయ్ తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయినవి. బాధితుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొర్రూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ,హత్యాయత్నం కేసు కింద నిందితులపై చర్యలు తీసుకుని, యేషబోయిన రాములు సహా నలుగురిని రిమాండ్‌కు తరలించారని తొర్రూర్ ఎస్సై తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!

  2. Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!

  3. Nalgonda : పోలీస్ జాగిలంకు ఘనంగా అధికార లాంచనాలతో అంత్యక్రియలు..!

  4. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

మరిన్ని వార్తలు