TOP STORIESBreaking Newsజాతీయం
LPG : వంట గ్యాస్ బుకింగ్ పై కేంద్రం క్లారిటీ..!
ఎల్పిజి వంట గ్యాస్ రీఫిలింగ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ఎల్పిజి గ్యాస్ రీఫిలింగ్ పై గడువు పెంచారంటూ వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.

LPG : వంట గ్యాస్ బుకింగ్ పై కేంద్రం క్లారిటీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఎల్పిజి వంట గ్యాస్ రీఫిలింగ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ఎల్పిజి గ్యాస్ రీఫిలింగ్ పై గడువు పెంచారంటూ వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఎల్పిజి గ్యాస్ బుకింగ్ గడువు ఉన్నట్లు పేర్కొన్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న గడువు ఏమాత్రం మారలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
తగినంత ఎల్పిజి గ్యాస్ నిల్వలు దేశంలో ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. ఎల్పిజి గ్యాస్ బుకింగ్ గడువును సింగిల్ సిలిండర్ కు 25 రోజులు, డబుల్ సిలిండర్లకు 35 రోజులు, ఉజ్వల గ్యాస్ కు 45 రోజులు.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుందని, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, గ్యాస్ బుకింగ్ పై ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
SIMILAR NEWS









