Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

LPG GAS : గ్యాస్ కొరత నేపథ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..!

దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది.

LPG GAS : గ్యాస్ కొరత నేపథ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..!

మన సాక్షి :

దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. కాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి అదనపు కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇటీవలనే 10% కమర్షియల్ గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం.. తాజాగా మరో 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్స్, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానిక సంస్థలతో నడిపించే క్యాంటీన్లకు, కమ్యూనిటీ కిచెన్ లకు సరఫరా అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు