Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

Viral : జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రుల భేటీ.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఇద్దరు తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఇటీవల ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో మంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Viral : జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రుల భేటీ.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఇద్దరు తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఇటీవల ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో మంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు హైదరాబాదులో మీనాక్షి నటరాజన్ తో భేటీకి గైరాజరైన జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు.

తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేకంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షంలో చేరితే రాష్ట్ర ప్రజలకు వేరే విధంగా సంకేతాలు అందుతాయని జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

అయితే రంజాన్ వేడుకల్లో జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన గులాబీ గూటికే చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా బిజెపి నాయకులు కూడా జీవన్ రెడ్డిని సంప్రదించినట్లు సమాచారం.

మంత్రుల భేటీ అనంతరం భేటీని జీవన్ రెడ్డి లైట్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MOST READ 

మరిన్ని వార్తలు