Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Madanapalle : ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఆగ్రహంతో ఊగిపోతున్న మదనపల్లె..!

ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకి చెందిన ఏడేళ్ల చిన్నారి రుషిక దారుణ హత్య ఘటన హృదయ విదారకమని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ.కవితా రాణి పేర్కొన్నారు.

Madanapalle : ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఆగ్రహంతో ఊగిపోతున్న మదనపల్లె..!

మదనపల్లి రూరల్, మన సాక్షి:

ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకి చెందిన ఏడేళ్ల చిన్నారి రుషిక దారుణ హత్య ఘటన హృదయ విదారకమని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ.కవితా రాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఖచ్చితంగా ఉరితీసి న్యాయం చేయవలసిన బాధ్యత చట్టాలది మరియు ప్రభుత్వానిది మాత్రమేనన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా,ఇలాంటివి మరొకసారి జరగకుండా కఠిన కారాగార శిక్షలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. హంతకుడు మాదకద్రవ్యాలను తీసుకుని చిన్నారిపై హత్యకు పాల్పడ్డాడని, ఈ మాదకద్రవ్యాలను నిర్మూలించే విధంగా మరింత అవగాహన కార్యక్రమాలను విద్యార్థి దశ నుండి చిన్నారులకు పాఠ్యపుస్తకాలలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇలాంటి వ్యక్తులను గుర్తించే విధంగా బాలికలు చిన్ననాటి నుండే గుడ్ టచ్ బాడ్ టచ్ తెలియని వ్యక్తులతో ఎలాంటి పరిచయాలు పంచుకోవడం ద్వారా అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రుల నుంచి పాఠశాల నుండి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.ఇలాంటి వ్యక్తులను ఫోక్సో చట్టం ద్వారా మరణశిక్ష విధించాలని ప్రజా సంఘాలతో కలిసి చిన్నారి కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు