క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Madgulapalli : మాడ్గులపల్లి నూతన ఎస్ఐగా సురేష్ యాదవ్ బాధ్యతల స్వీకరణ..!
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం నూతన ఎస్ఐగా సురేష్ యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పనిచేసిన కృష్ణయ్య విఆర్ కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేష్ యాదవ్ బదిలీ పై వచ్చారు.

Madgulapalli : మాడ్గులపల్లి నూతన ఎస్ఐగా సురేష్ యాదవ్ బాధ్యతల స్వీకరణ..!
మాడుగులపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం నూతన ఎస్ఐగా సురేష్ యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పనిచేసిన కృష్ణయ్య విఆర్ కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేష్ యాదవ్ బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అక్రమ ఇసుక రవాణా,మత్తు పదార్థాల లాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన ఎస్సై కి పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు.









