Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పునరాలోచించాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పునరాలోచించాలి.. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..!

జగిత్యాల, (మన సాక్షి)

మహాత్మాగాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, ఉపాధిహామీ పథకానికి మహాత్మగాంధీ పేరు మార్చే ఆలోచన ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టాలని, యూపీఏ ప్రభుత్వం పథకం ప్రవేశ పెట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించి, మెరుగు పరచాలని అన్నారు. ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచటం పై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.

గ్రామీణ ప్రాంతంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఉపాధి నిధులు ఆదారం అయ్యాయని తెలిపారు. అవినీతిని నిలువరించేందుకు, పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, నిరుపేద వర్గాల ప్రజలు ఆకలితో అలమటించ కూడదని ఆహార భద్రత చట్టం, విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్యా హక్కు చట్టాన్ని, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉపాధి హామీ చట్టాన్ని యూపీ ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

సోనియా గాంధీ ఆలోచన, మన్మోహన సింగ్ దార్శనికత తో జాతిపిత మహాత్మ గాంధీ పేరిట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా నామకరణం చేశారన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు పని కల్పించేందుకు ఉపాధి హామీ చట్టంరూపొందించారు. స్వాతంత్య్రం కోసం అహింసాయుతంగా పోరాటం చేసిన మహాత్మ గాంధీ స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.

రెండు దశాబ్దాల కాలంలో ఉపాధి కల్పించడంతో పాటు, ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిందన్నారు. హరిత హారం గుంతలు తీయడం, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, పాఠశాలల్లో టాయిలెట్స్, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు,గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు,అన్ని ఉపాధి హామీ పథకం నిధులే ఆధారం అని తెలిపారు.

ఉపాధి హామీ పథకం దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. గతంలో 100 రోజులు పని దినాలు కల్పించారు. ప్రస్తుతం 125 దినాలు గా పెంచటం పై హర్షం ప్రకటిస్తున్నామన్నారు. గతంలో వ్యవసాయ రంగానికి కూడా ఉపాధి హామీ అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయడంతో కూలీలకు పని లభించడంతో పాటు, రైతులకు మేలు జరుగుతుందన్నారు.

వ్యవసాయానికి అనుసంధానం చేసి ఉపాధి హామీ పథకానికి మార్పులు చేసి, అమలు చేయాలని కోరారు.దేశ స్వాతంత్ర్యం కోసం మార్గదర్శనం చేసిన మహోన్నతుడు మహాత్మ గాంధీ అని.ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు మార్చాలనే ప్రతిపాదన సరి కాదన్నారు.

కేంద్రం గతంలో ఉపాధి హామీ పథకానికి 100 శాతం నిధులు కేటాయించిందని, ప్రస్తుతం కేంద్రం 60 శాతం రాష్ట్రం 40శాతం కేటాయించాలని ప్రతిపాదించడంతో రాష్ట్రాల పై భారం పెరిగి, నిధుల కొరత ఉపాధి హామీ పథకం అమలుకు ఆటంకంగా మరే ప్రమాదం ఉందన్నారు.

యూపీఏ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు హక్కుగా లభిస్తుందన్నారు ప్రజల గుండెల్లో ఉన్న నెహ్రూ పేరు తుడిచివేయాలని మోదీకి నెహ్రూ పై ఈర్ష్య ఉండేదని, ఇప్పుడు మహాత్మ గాంధీ పై పడ్డారు అన్నారు.

మహాత్మ గాంధీ పేరు తొలగించి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవక మిషన్ గ్రామీణ గా (విబిజి రాంజీ) గా పేరు మార్చాలన్నే ప్రతిపాదన దారుణం అని తెలిపారు. కలియుగంలో శ్రీరాముడు ప్రజలందరికీ ఆరాధ్య దైవం, మహాత్మ గాంధీ తుది శ్వాస విడిచేటప్పుడు కూడా హే రామ్ అని ప్రాణాలు విడిచారన్నారు.

మేము శ్రీరాములవారి ఆరాధకులమేఅని అన్నారు
జగిత్యాల జిల్లాలో కోదండ రామాలయం నిర్మాణం చేపట్టామని తెలిపారు. వికసిత భారత్ రాముడి పాలన అనుసరిస్తుందని భావిస్తే వికసిత భారత్ కు వికసిత శ్రీరామ్ అని పేరు పెట్టండి అన్నారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరింత మెరుగు పర్చేందుకు కృషి చేయండి అని హితవు పలికారు. పథకం పేరు మార్చడంతో ప్రజలకు, ఒనగూరే ప్రయోజనం ఏమిలేదన్నారు.

మహాత్మ గాంధీ పేరు మార్చినా చెరిగేది కాదని అదిప్రజల గుండెల్లో ఉంటుందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరు తొలగించాలని ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనీ మాజీమంత్రి జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈసమా వేశంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షులు కొత్తమోహన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, జున్ను రాజేందర్,లతోపాటు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Local Body Elections : మూడో విడత పంచాయతీ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..!

  2. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!

  4. Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!

మరిన్ని వార్తలు