Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

బంధువుల దుష్ప్రచారం.. యువజంట ఆత్మహత్య.. (సెల్ఫీ వీడియో)

బంధువుల దుష్ప్రచారం.. యువజంట ఆత్మహత్య.. (సెల్ఫీ వీడియో)

మన సాక్షి , వెబ్ డెస్క్ :

బంధువుల దుష్ప్రచారంతో యువజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. చనిపోయే ముందు వారు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడి పోలీసులకు పంపారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై దంపతులను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ – మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ మండలం హెగ్జోలికి చెందిన అనిల్ (28), పోతంగల్ కు చెందిన శైలజ (24) ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఇంటర్వ్యూకు వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చారు. అనంతరం తాను ఒక తప్పు చేశానని.. భర్త క్షమించినా.. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడానికి తట్టుకోలేక గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి పోలీసులకు వీడియో పంపగా అలర్ట్ అయ్యారు.

గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టగా కనిపించలేదు. ఆ తర్వాత బాధితుల ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేయగా ఫకీరాబాద్ – మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు గమనించి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు దంపతుల మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!

Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!

మరిన్ని వార్తలు