MLC : పట్టభద్రుల ఎమ్మెల్సీ లో మల్లన్న విజయం..!
MLC : పట్టభద్రుల ఎమ్మెల్సీ లో మల్లన్న విజయం..!
రెండో ప్రాధాన్యత లో 18 వేల మెజార్టీతో గెలుపు.
హోరా హోరీగా పోరాడిన బి ఆర్ఎస్ , కాంగ్రెస్.
మూడు రోజుల ఉత్కంఠకు తెర.
నల్లగొండ ,. మనసాక్షి :
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్లబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతలో మల్లన్నకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎలిమినేషన్ ప్రకారం కౌంటింగ్ చేయగా తీన్మార్ మల్లన్న 18 వేలఓట్ల ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి బీ ఆర్ఎస్ కు చెందిన రాకేష్ రెడ్డి పై గెలుపొందారు.
రాత్రి నుండి కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ..
ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 48 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కాగా 100 లోపు ఓట్లు వచ్చిన అభ్యర్థులు 26 మంది, వెయ్యిలోపు ఓట్లు వచ్చిన అభ్యర్థులు 20 మంది , మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దుర్గాప్రసాద్ 1947 బక్క జడ్సన్ 2057 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీరందరి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి కాగా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ సాధించిన 29,697 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ షేర్ చేశారు. 48 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అయ్యాయి.
అనంతరం బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓట్లు లెక్కించడంతో మల్లన్నకు సుమారుగా 18 ఓట్లు రావడంతో ఆయన మేజిక్ ఫిగర్ చేరుకున్నారు . తీన్మార్ మల్లన్న విజయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ALSO READ :









