Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

Miryalaguda : మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం.. సద్వినియోగం చేసుకోవాలి..!

Miryalaguda : మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం.. సద్వినియోగం చేసుకోవాలి..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జూన్ 7 (శుక్రవారం) ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత విద్య శిభిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అన్ని పరీక్షలకు 3800 కాగా కేవలం 599 రూపాయలకే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీనియర్ న్యూరో ఫిజీషియన్, నరాల మరియు వెన్నుపూస వైద్య నిపుణులు డాక్టర్ శ్యామ్ జె ఆర్ సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

దీర్ఘకాలికంగా నరాల, మెదడు, వెన్నుముక, పక్షవాతం, ఫిట్స్ సమస్యలతో బాధపడుతున్న వారు, షుగర్ వల్ల వచ్చే నరాల సమస్యలతో దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారు, ఇంకా ఇతర సమస్యలు ఉన్నవారు కూడా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

నరాల పరీక్ష , థైరాయిడ్ పూర్తి పరీక్ష , రక్తపరీక్ష, మూత్ర పరీక్ష , షుగర్ రెండు పర్యాయాలు, పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి టెస్టులకు 599 మాత్రమే చెల్లించాలని వారు కోరారు. పూర్తి వివరాలకు 85006 32333 సంప్రదించగలరు.

ALSO READ : 

Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!

బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి..!

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..? 

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు