Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అభ్యాస్ లో మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ..!

అతి తక్కువ కాలంలో పాఠకుల ఆదరణ మనసాక్షి చూరగొన్నదని అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి అన్నారు.

Miryalaguda : అభ్యాస్ లో మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

అతి తక్కువ కాలంలో పాఠకుల ఆదరణ మనసాక్షి చూరగొన్నదని అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మన సాక్షి తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సాక్షి తెలుగు దినపత్రిక ప్రజల గొంతుకగా ఉందన్నారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుందని, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో అభ్యాస్ టెక్నో హైస్కూల్ కరస్పాండెంట్ వంగాల పుష్పలత, ప్రధాన ఉపాధ్యాయులు పాండు, మధుకర్ రెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

MOST READ 

  1. Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..! 

  2. Nalgonda : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి కృషి.. INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి..!

  3. Miryalaguda : ప్రజాదరణ పొందిన మనసాక్షి.. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..!

  4. Hyderabad : డయల్–100కు క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్..!

మరిన్ని వార్తలు