తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
దమ్మపేట రూరల్, మన సాక్షి :
నిరంతరం నిత్యం నూతన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయటంలో మనసాక్షి పత్రిక ముందుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గండుగులపల్లి గ్రామంలో తన నివాసంలో మన సాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతర్జాలం ద్వారా ప్రజలకు తాజా సమాచారం చేరవేస్తూ అనతికాలంలోనే తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతూ ఇంకా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ALSO READ : హైదరాబాద్ : 13 దేశాల ప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆతిథ్యం..!
ఈ పత్రికా రంగంలో అనతికాలంలోనే 170 దేశాలకు పైగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో ముందున్నదని ఎమ్మెల్యే జారే తన అభిప్రాయాన్ని వెల్లడించారు పత్రికా రంగంలో పాత్రికేయులు సమాజ అభ్యున్నతికి ప్రజలకు దిక్సూచిగా ఉండాలని ఎమ్మెల్యే జారే కోరారు.
ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కక్కిరాల రమేష్ మన సాక్షి రిపోర్టర్ షణ్ముఖ. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేంద్ర గండుగులపల్లి సర్పంచ్ , ఉప సర్పంచ్ ,జెడ్పిటిసిలు ,ఎంపీటీసీలు , కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ALSO READ : Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!









