Breaking Newsతెలంగాణనల్గొండవైద్యం

Miryalaguda : రేపటి నుంచి మూడు రోజులపాటు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!

Miryalaguda : రేపటి నుంచి మూడు రోజులపాటు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మూడు రోజులపాటు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మెగా నరాల వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

శిబిరంలో సీనియర్ న్యూరో కన్సల్టెంట్, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ డాక్టర్ ప్రదీప్ ముచ్చర్ల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో మెదడు, వెన్నెముక, నరాలు, పక్షవాతం, ఫిట్స్, తలనొప్పి, తిమ్మిర్లు, మతిమరుపు, ఇలాంటి సమస్యలపై పరీక్షించనున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ వైద్య శిభిరంలో నరాల పరీక్ష, మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, షుగర్ పరీక్ష, 4000 రూపాయల విలువైన అన్ని పరీక్షలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. కేవలం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 399 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ వైద్య శిబిరాన్ని మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత మండలాల అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పూర్తి వివరాలకు 8500632333, 8367631333 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని వారు పేర్కొన్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!
  2. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

  4. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!

  5. Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

మరిన్ని వార్తలు