తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Job Mela : 205 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Job Mela : 205 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

హుజుర్ నగర్, మనసాక్షి :

యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళుతుందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్నగర్ పట్టణంలో ఈనెల 25న నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం ఆయన పేర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేసిందని ఇప్పటికే సుమారుగా 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిందని చెప్పారు.అలాగే ప్రైవేటు రంగంలో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

సమాజంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సవాల్ గా మారిందని తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులను అమ్మి తమ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని పెద్ద చదువులు చదివిపించిన అనుకున్న రీతిలో వారికి ఉద్యోగాలు రావటం లేదని నాకు కూడా బాధ కల్గిందని అందుకే పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆఫ్ తెలంగాణ ), సింగరేణి కాలరీస్ వారి సహకారంతో హుజూర్నగర్ లో ఈ నెల 25 న దేశంలోనే భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఇప్పటికే 205 కంపెనీలు, 9500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాకు హాజరవ్వాలని వ్యక్తిగత ఆసక్తితో వారిని ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
జాబ్ మేళా కు వచ్చే అభ్యర్థులకు సౌకర్యార్థం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లాంచ్ సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నామని అలాగే వారికి పార్కింగ్ సమస్య లేకుండా చూస్తున్నామని అన్నారు.వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద, కంపెనీ స్టాల్స్ వద్ద, భోజనాలు వద్ద స్థానిక నాయకులతో కమిటీ వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మంత్రి తెలిపారు.

జాబ్ మేళాను విజయవంతం చేయుటకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేపర్ ప్రకటనలు,పాంప్లెట్లు, బస్సులకి వాల్ పోస్టర్లు అతికించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇక నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున నిర్వాహకులు పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టి ఇంకా ఎక్కువ కంపెనీలను ఆహానించి ఇట్టి జాబ్ మేళాను భారీ స్థాయి లో విజయవంతం చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ,,డీట్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్,ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!

  2. Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!

  4. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

  5. District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

మరిన్ని వార్తలు