తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Job Mela : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5న మెగా జాబ్ మేళా..!

Job Mela : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5న మెగా జాబ్ మేళా..!

నల్లగొండ, మన సాక్షి:

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువ తేజం కార్యక్రమంలో భాగంగా ఈనెల 5న శనివారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతీ యువకుల మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

కనీసం పదవ తరగతి/ ఇంటర్/డిప్లమా/ఫార్మసీ/డిగ్రీ/ ఇంజనీరింగ్/పీజీ స్థాయి విద్యార్థులు వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు లోపు వారు మీ యొక్క వివరాలను మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.ఇట్టి జాబ్ మేళా లో వందకు పైగా కంపెనీలు, 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని తెలిపారు.

జాబ్ లో సెలెక్ట్ అయిన వారందరికీ వారి అర్హతలను బట్టి కనీస జీతం 13000/- రూపాయలు ఇవ్వబడునున్నారు.ఈ యొక్క అద్భుత అవకాశం నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MOST READ :

మరిన్ని వార్తలు