Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

PDS RICE : అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

PDS RICE : అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

ముత్తారం, ధర్మారం , మన సాక్షి ప్రతినిధి :

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మండల కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ముత్తారం మండల కేంద్రంలో గంట భీమయ్య అనే వ్యక్తి వద్ద అక్రమంగా ఉన్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందని అన్నారు.

గంట భీమయ్య పై తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ తనిఖీలలో ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!

BREAKING : కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం.. ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని..!

మరిన్ని వార్తలు