Nalgonda : నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి..!

Nalgonda : నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి :
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యతనిచ్చి ఎన్ని నిధులైన కేటాయిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమటో గ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ చెందిన సర్పంచ్ లు శుక్రవారం నల్గొండ లోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్) లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదవులు అనేవి ఎవరికి శాశ్వతం కావని తెలిపారు.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు గ్రామాలలో అందరినీ కలుపుకుపోతూ పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
ఎన్నికలప్పుడే పార్టీలని, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. నల్గొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధికి తాను తగిన నిధులు కేటాయిస్తానని అన్నారు. గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంత పెద్ద సమస్య,కష్టం వచ్చిన అధైర్య పడవద్దు అని సూచించారు.
తాను కుమారుని కోల్పోయిన పేద ప్రజలకు సహాయం చేస్తూ వారిలో తన కొడుకును చూసుకుంటున్నానని అన్నారు.ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతోషం తనకు ఎక్కడ లేదనిపేర్కొన్నారు. నల్గొండ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన పెద్ద సూరారం సర్పంచ్ గుండె జానమ్మ, ఉప సర్పంచ్ పెండెం అరుణ రామకృష్ణ, తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం సర్పంచ్ ఊట్కూరి వాణి సురేందర్ రెడ్డి, నల్లగొండ మండలం చెన్నుగూడెం సర్పంచ్ మర్రి సతీష్ యాదవ్, బుద్ధారం సర్పంచ్ తుక్కాని వెంకట్ రెడ్డి, చందన పెళ్లి సర్పంచ్ పెద్ది లక్ష్మమ్మ గోవర్ధన్, నర్సింగ్ బట్ల సర్పంచ్ జకిర తాజుద్దీన్,
వెలుగు పల్లి సర్పంచ్ పోతేపాక వినోద్, కాంచనపల్లి సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి, తొర్రగల్ సర్పంచ్ చిర్రబోయిన యాదయ్య, దొనకల్ సర్పంచ్ కొత్తపల్లి సునీత తదితర నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
MOST VIEWS









