Komatireddy Venkatreddy : రుణమాఫీ పై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. లక్షన్నర రుణమాఫీ పై స్పష్టం..!
Komatireddy Venkatreddy : రుణమాఫీ పై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. లక్షన్నర రుణమాఫీ పై స్పష్టం..!
నల్లగొండ, మనసాక్షి :
గురుపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురుపూర్ణిమ ను పురస్కరించుకొని ఆదివారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని. ము శంపల్లిలో రోడ్డులోని సాయిబాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా లక్షన్నర రుణమాఫీ 20 రోజులలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద 32 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు.
రామగిరి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నల్గొండ జిల్లా తో పాటు, నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లు సభ్యులు.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి, వంగూరి లక్ష్మయ్య. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి .పలువురు కౌన్సిలర్లు .కాంగ్రెస్ కార్యకర్తలు. భక్తులు. ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్డఓ రవి, డిఎస్పి శివరాంరెడ్డి, స్థానిక తహసిల్డర్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Runamafi : రుణమాఫీ పై కీలక అప్డేట్.. రెండవ విడత మాఫి ఎప్పుడంటే..!
Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!









