Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, ఖమ్మం :
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ తెలియజేశారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచిలో విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అన్నింటిని అమలు చేస్తామన్నారు.
ఇప్పటికే కొన్ని అమలు చేశామని మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై ఆయన కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేనందున తులం బంగారం పంపిణీ కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినప్పటికీ ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
MOST READ :









