Miryalaguda : మిర్యాలగూడలో నేడు మంత్రుల పర్యటన..!
Miryalaguda : మిర్యాలగూడలో నేడు మంత్రుల పర్యటన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించనున్నారు.
మధ్యాహ్నం3.30 గంటలకు మిర్యాలగూడ చేరుకొని పట్టణంలోని రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద 4 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం 4 గంటలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులకు రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో 30 టన్నుల బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. 5 గంటలకు స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం కానున్నారు.
వారి వెంట నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఉంటారు.
LATEST UPDATE :
Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం.. రేపు మంత్రులచే భూమి పూజ..!
Suryapet : మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అపోహలే.. ఒకే వేదికపై బద్ధ శత్రువులు..!
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!









