Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కె.ఎన్.ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఎం. భీమార్జున రెడ్డి తెలిపారు.

Miryalaguda : తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కె.ఎన్.ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఎం. భీమార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఫిజిక్స్ సబ్జక్ట్ లో 01, కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ లో 01, ఇంగ్లిష్ లో 01 ఖాళీలు ఉన్నాయని, సంబంధిత సబ్జక్ట్ పి. జి.లో 55 శాతంతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పి. హెచ్ డి, నెట్, సెట్, బోధనానుభవం కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోపు దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో నేరుగా సమర్పించాలని తెలిపారు. ఈ నియామకాలు కమీషనర్, కళాశాల విద్య వారు జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి ఉంటాయని ప్రధానాచార్యులు తెలిపారు.










