Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ పాఠశాలలో బతుకమ్మ పండుగ వేడుక..!
Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ పాఠశాలలో బతుకమ్మ పండుగ వేడుక..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అభ్యాస్ ప్రైమరీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అభ్యాస్ విద్యాసంస్థల అధినేత వంగాల నిరంజన్ రెడ్డి పుష్పలత హాజరై పాఠశాలలో బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పిన పండుగ బతుకమ్మ పండగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంస్కృతి సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలన్నారు. బొడ్డెమ్మ ఆరంభం నుండి మహా అష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే ముందుగా ఆడుకుంటామన్నారు.
బతుకమ్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి గౌరీ మాతను గుమ్మడి పూలతో తయారుచేసి అమ్మవారి పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ప్రత్యేక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత మరియు అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :











