Miryalaguda : ఫర్టిలైజర్ యూరియా యాప్ పై మిర్యాలగూడలో రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి..!
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఫర్టిలైజర్ యూరియా యాప్” ద్వారా రైతులు కూర్చున్న చోటు నుండే యూరియాను పొందవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

Miryalaguda : ఫర్టిలైజర్ యూరియా యాప్ పై మిర్యాలగూడలో రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఫర్టిలైజర్ యూరియా యాప్” ద్వారా రైతులు కూర్చున్న చోటు నుండే యూరియాను పొందవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఈ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకున్న రైతులు సులభంగా యూరియాను పొందే అవకాశం ఉందని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేదని అన్నారు. అందువల్ల రైతులందరూ ఫర్టిలైజర్ యూరియా యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, కొత్తగూడెంకు ప్రభుత్వ భూములు పరిశీలన నిమిత్తం రాగా అక్కడ రైతులతో ఫర్టిలైజర్ యూరియా యాప్ గురించి ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆన్లైన్ లో తమకు ఓటిపి గురించి అవగాహన లేకపోవడం, ఓటిపి సకాలంలో నమోదు చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అన్ని దుకాణాలలో యూరియాను అందుబాటులో ఉంచితే బాగుంటుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ గుర్తించిన డీలర్ల వద్ద యూరియాను స్టాకు ఉంచడం జరిగిందని, యూరియా కోసం గతంలో లాగా రైతులు గంటల తరబడి ఫెర్టిలైజర్ దుకాణాల వద్ద నిలబడాల్సిన పనిలేదని, ఇంట్లో కూర్చున్న చోటు నుండి యూరియాను బుక్ చేసుకోవచ్చని, నిర్దేశించిన సమయంలో యూరియాను తీసుకోవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష 46 వేల మంది రైతులు ఆరు లక్షల 1137 బ్యాగుల యూరియాను కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిర్యాలగూడ తహసిల్దార్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
MOST READ
-
Miryalaguda : హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. 40వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..!
-
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!
-
ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!
-
Miryalaguda : హాస్టళ్లలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ..!










