Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో సూపరిండెంట్ ఇంజినీర్ పి.చిన్నా రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకి చిక్కాడు.

ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!

కూకట్ పల్లి, (మన సాక్షి):

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో సూపరిండెంట్ ఇంజినీర్ పి.చిన్నా రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకి చిక్కాడు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని అల్వాల్, కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్లలోని చెరువులలో గుర్రపుడెక్క, పూడికతీత పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్ తనకు రావలసిన బిల్లుల కోసం సూపరిండెంట్ ఇంజినీర్ పి.చిన్నా రెడ్డిని సంప్రదించి తనకు రావలసిన ఒక కోటి 40 లక్షల రూపాయల బిల్లులను విడుదల చేయమని విజ్ఞప్తి చేశాడు.

ఆ మొత్తాన్ని విడుదల చేసేందుకు తనకు 40 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని చిన్నా రెడ్డి డిమాండ్ చేయగా తాను అంత ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ తెలపటంతో 30 లక్షలకు తగ్గేది లేదని చిన్నా రెడ్డి తెలుపగా, తాను 30 లక్షలు సైతం ఒకే సారి ఇచ్చుకోలేనని విడతల వారిగా ఇచ్చేందుకు కాంట్రాక్టర్ సుముఖత వ్యక్తం చేశాడు.

ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేయటంతో నేడు మొదటి విడతగా 15 లక్షల రూపాయలు, చిన్నా రెడ్డి వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న ప్రవీణ్ చేతికి అందజేస్తుండగా, ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రంగారెడ్డి రేంజ్ ఏసిబి డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

MOST READ 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

  2. Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడే బోణీ.. కాంగ్రెస్ జోష్..!

  3. తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!

  4. Gold Price : మరింత తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు