Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక.. వీడిన సస్పెన్స్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సస్పెన్స్ వీడింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక.. వీడిన సస్పెన్స్..!

మిర్యాలగూడ , మన సాక్షి,

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సస్పెన్స్ వీడింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

మున్సిపల్ చైర్పర్సన్ గా చిలుకూరి సుధ ను ఆ పార్టీ ఖరారు చేసింది. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా గుడిపాటి శిరీష ను ఎన్నిక చేశారు. దాంతో వారు ఎన్నిక లాంచనమైంది.  అనంతరం వారు ప్రమాణస్వీకారం చేశారు.

ఈ ఎన్నికల్లో మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీకి 31 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కు 14, బిజెపి 1, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

మరిన్ని వార్తలు