Miryalaguda : సెయింట్ జాన్స్ హైస్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే..!
మిర్యాలగూడ చైతన్య నగర్ లోని సెయింట్ జాన్స్ హైస్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే, వార్షిక దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : సెయింట్ జాన్స్ హైస్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ చైతన్య నగర్ లోని సెయింట్ జాన్స్ హైస్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే, వార్షిక దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డే అనేది విజయాన్ని జరుపుకునే రోజు, భవిష్యత్తుకు కొత్త ఆరంభం, విద్యార్థులు పేర్లు రాయడం, చదవడం నేర్చుకుని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకుంటూ కిండర్ గార్టెన్ పూర్తి చేసుకుని ప్రైమరీ విద్యకు. సంసిద్ధం అయినారు.
ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడం మా పాఠశాల ప్రత్యేకత అని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ అలుగు బెల్లి శిరీష తో కలిసి విద్యార్థులకు సర్టిఫికేట్స్ మెమెంటోలను అందజేసారు,
వార్షిక దినోత్సవంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయు విద్యార్థులు, వారి తల్లి దండ్రులు పాల్గొని విజయ వంతం చేసారు. ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రవి శంకర్ రెడ్డి, మల్లికార్జున్, కె. సుమన్, పరమేశ్వరి, పద్మ, ఇ. లావణ్య, సుజాత, శృతి, సుందరయ్య పాల్గొన్నారు.











