Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ జంక్షన్ లలో ప్రమాదకరంగా ఫౌంటెన్స్.. పరిమాణం తగ్గించాలని ఎమ్మెల్యే ఆదేశం..!

Miryalaguda : మిర్యాలగూడ జంక్షన్ లలో ప్రమాదకరంగా ఫౌంటెన్స్.. పరిమాణం తగ్గించాలని ఎమ్మెల్యే ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రమాదకరంగా ఫౌంటైన్స్ ఉన్నాయి. ఫౌంటెన్స్ వల్ల కూడళ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి స్థానికులు ఎన్నో పర్యాయాలు తీసుకెళ్లారు. అయినా కూడా ఎవరు స్పందించలేదు. ఫౌంటెన్స్ చాలా పెద్దగా ఉండడం వల్ల రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

కాగా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లగా మంగళవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్, తడకమళ్ళ ఎక్స్ రోడ్డు, మిర్యాలగూడ వై జంక్షన్ లో ఫౌంటైన్స్ అధిక పరిమాణంలో ఉండడం వల్ల ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు.

కాగా వెంటనే ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఫౌంటెన్స్ పరిమాణం తగ్గించాలని కాంట్రాక్టర్ కి సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిఎస్పి రాజశేఖర్ రాజు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!

  2. మద్యం షాపులో దోపిడి.. పోలీసుల విచారణ..!

  3. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!

  4. Video : కామంతో కళ్ళు మూసుకుపోయి.. నడిరోడ్డుపై.. (వీడియో)

మరిన్ని వార్తలు