Miryalaguda : కేఎన్ఎం కళాశాల అధ్యాపకురాలు స్వప్నకు డాక్టరేట్..!
కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత నాలుగు సంవత్సరాలుగా వృక్ష శాస్త్రం అధ్యాపకురాలుగా కొనసాగుతున్న రావుల స్వప్నకి రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.

Miryalaguda : కేఎన్ఎం కళాశాల అధ్యాపకురాలు స్వప్నకు డాక్టరేట్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత నాలుగు సంవత్సరాలుగా వృక్ష శాస్త్రం అధ్యాపకురాలుగా కొనసాగుతున్న రావుల స్వప్నకి రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. డాక్టర్ రావుల స్వప్న డాక్టర్ దినేష్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో ఏ స్టడీ ఆన్ స్పెషల్ స్పీసిస్ అవైలబుల్ ఇన్ నేచర్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ డిక్రీజింగ్ ఎయిర్ పొల్యూటెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశం పైన పరిశోధన నిర్వహించి డాక్టరేట్ పట్టాను పొందారు.
డాక్టర్ రావుల స్వప్న గత 17 సంవత్సరాలుగా వృక్ష శాస్త్రంలో తెలంగాణలోని వివిధ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్రం అధ్యాపకురాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. విద్యా బోధనలోనే కాకుండా తను విద్యార్థి జీవితంలో కూడా అన్ని తరగతులలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ కలిగిన స్టూడెంట్ గా రావుల స్వప్న నిలిచేవారు. రావుల స్వప్న కుటుంబంలో కూడా తన భర్త పసుల పురుషోత్తం గారు కూడా మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా మోడల్ స్కూల్స్ లో ఉద్యోగం కొనసాగిస్తున్నారు.
భార్యాభర్తలు ఇరువురు ఉపాధ్యాయ వృత్తికి అంకితమై పని చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రావుల స్వప్న మాట్లాడుతూ తాను డాక్టరేట్ పొందే విధంగా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నా తల్లిదండ్రులు రావుల పాపయ్య, కృష్ణవేణి,భర్త పసుల పురుషోత్తం,తోటి అధ్యాపకుల ప్రోత్సాహం వల్లనే నేను ఇది సాధించగలిగాను అని తెలియజేశారు. డాక్టర్ రావుల స్వప్నకు డాక్టర్ రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ భీమార్జునారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతేకాక కళాశాలలోని అధ్యాపకులు ఈ విధంగా డాక్టర్లు సాధించినట్లయితే ఉన్నత విద్య మరింత క్వాలిటీగా ముందుకు పోతుందని, పరిశోధనలు మరింత మెరుగవుతాయని ఈ సందర్భంలో భీమార్జునురెడ్డి అధ్యాపకులు ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ రావుల స్వప్నకు డాక్టరేట్ రావడం పట్ల కళాశాలలోని అధ్యాపకులు శ్రీ వెంకటరమణ డాక్టర్ గుమ్మడి నరేష్ నాగరేఖా రాణి రవీందర్ బాబు, డాక్టర్ శివకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ అయినా నాగరాజు, అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.










