Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

Hyderabad : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మదీనా బాధితులకు ప్రభుత్వం అండ..!

“ఈ ప్ర‌భుత్వం మీది.. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు.. మీకు అండ‌గా ఉంటాం” అని మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.

Hyderabad : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మదీనా బాధితులకు ప్రభుత్వం అండ..!

హైదరాబాద్, మన సాక్షి

“ఈ ప్ర‌భుత్వం మీది.. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు.. మీకు అండ‌గా ఉంటాం” అని మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు. స‌చివాల‌యంలో శ‌నివారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో బాధిత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి, ఆర్థిక సహాయం అందజేశారు.

నాడు ప్ర‌మాద ఘ‌ట‌న తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపిన విషయాన్ని వారికి గుర్తు చేశాను. స‌హ‌జంగా దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతిచెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించ‌వు కానీ, ప్రజా ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నది.

ప్ర‌మాదంలో మృతిచెందిన 44 కుటుంబాల వారికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌, తీవ్రంగా గాయ‌ప‌డిన వారి కుటుంబానికి రూ.3 ల‌క్ష‌ల చొప్పున చెక్కు ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు