Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్వ్యవసాయం

Breaking : బస్తా యూరియా కోసం బారులు.. ఆలూర్ సొసైటీ వద్ద రైతుల పాట్లు..!

పంటను కాపాడుకోవాల్సిన సమయంలో, పొలంలో ఉండాల్సిన రైతన్న.. వ్యవసాయ కేంద్రం వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది.

Breaking : బస్తా యూరియా కోసం బారులు.. ఆలూర్ సొసైటీ వద్ద రైతుల పాట్లు..!

ఆర్మూర్, మన సాక్షి:

పంటను కాపాడుకోవాల్సిన సమయంలో, పొలంలో ఉండాల్సిన రైతన్న.. వ్యవసాయ కేంద్రం వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా మండల కేంద్రమైన ఆలూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ వద్ద శనివారం యూరియా కోసం రైతులు ఉదయం నుండి బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షించినా బస్తా దొరుకుతుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొంది.

తెల్లవారుజాము నుండే వందలాది మంది రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకొని చెప్పులు లైన్లో పెట్టారు.మీటర్ల పొడవున లైన్లు కట్టడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.”ఇదేమి ప్రభుత్వం?” అంటూ రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ సీజన్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు యూరియా నిల్వలు లేకపోవడం ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారు కానీ మాకు మాత్రం సరైన సమయానికి ఎరువులు అందడం లేదు. దీనికి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిల్వలను పెంచకపోతే పంటలు నష్ట జరిగే ప్రమాదం ఉంది.యూరియా కొరతను సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని,వెంటనే స్పందించి యూరియా యాప్ తీసివేసి,ప్రతి రైతుకూ సరిపడా ఎరువులు అందేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులను స్థానిక రైతాంగం డిమాండ్ చేస్తోంది.

MOST READ : 

మరిన్ని వార్తలు