Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణహైదరాబాద్

TG : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. జిల్లా కలెక్టర్ల మార్పు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు అయ్యాయి. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

TG : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. జిల్లా కలెక్టర్ల మార్పు..!

హైదరాబాద్, మన సాక్షి:

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు అయ్యాయి. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. 45 మంది ఐఏఎస్ అధికారుల్లో జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

  • అనురాగ్ జయంతి – యాదాద్రి జిల్లా కలెక్టర్ గా బదిలీ.
  • ప్రదీప్ జైన్ – నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ.
  • పమేలా సత్పతి – లేబర్ కమిషనర్ గా నియామకం.
  • కుష్బూ గుప్తా – మహబూబ్‌నగర్ కలెక్టర్ గా నియామకం.
  • చాహత్ బాజ్పాయి – హనుమకొండ కలెక్టర్ గా నియామకం.
  • అనికేత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా నియామకం.
  • ప్రతిమ సింగ్ – మెదక్ కలెక్టర్ గా నియామకం.
  • గరిమ అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా నియామకం.
  • స్నేహ శబరీష్ – హైదరాబాద్ కలెక్టర్ గా నియామకం.
  • సిక్తా పట్నాయక్ – నారాయణపేట నుంచి ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ.
  • సందీప్ కుమార్ జా – జనగాం కలెక్టర్ గా నియామకం.
  • ముష్రఫ్ అలీ ఫారుఖీ – టీఎస్ జిపిడిసిఎల్ సిఎండిగా నియామకం.
  • జితేష్ వి పాటిల్ – టి ఎస్ జి పి డి సి ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ.
  • చిత్ర మిశ్రా – కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా నియామకం.
  • విజయేంద్ర – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా నియామకం.
  • అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ నుంచి ఢిల్లీ తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ.

వీరితోపాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఎండోమెంట్ కమిషనర్ గా హనుమంతరావుకు అప్పగించారు. ఫైనాన్స్ శాఖ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, ఐటి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ ను నియమించారు. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దాన కిషోర్ ను నియమించారు.

MOST READ : 

  1. Hyderabad : హైదరాబాదులో దారుణం.. రెండు నెలల శిశువు కాళ్లు, చేతులు కట్టేసి పొయ్యిలో పడేసి హత్య చేసిన కన్నతల్లి..!
  2. Nalgonda : అక్రమంగా ధాన్యం విక్రయించిన మిల్లర్లు.. నల్గొండ జిల్లాలో ఇద్దరు అరెస్ట్, పరారీలో ఐదుగురు మిల్లర్లు..!
  3. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!
  4. Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. మార్చిలో సెలవులే సెలవులు..!

మరిన్ని వార్తలు