Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలోని ఇస్లాంపురలో భారీ అగ్నిప్రమాదం..!
మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురం ప్రాంతంలో ఉన్న చెప్పుల గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Miryalaguda : మిర్యాలగూడలోని ఇస్లాంపురలో భారీ అగ్నిప్రమాదం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురం ప్రాంతంలో ఉన్న చెప్పుల గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులతో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలను త్వరగా అదుపు చేసేందుకు మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ట్యాంకర్లను తెప్పించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. కానీ గోదాంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బాధితులకు జరిగిన ఆస్తినష్టంపై సంబంధిత అధికారులు వివరాలు సేకరించి, తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.









