Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి..!

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి..!
నల్లగొండ, మన సాక్షి
అధికారం ఉందని అడ్డగోలు వ్యవహారానికి తెరదీశాడు ఓ ఎమ్మెల్యే అంగరక్షకుడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అంగరక్షకుడు (గన్ మెన్) రైతుల కోసం వచ్చిన యూరియా లారీని దారి మళ్లించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.. రైతుల కోసం కేటాయించిన లారీ లోడ్ యూరియాను దారి మళ్లించేందుకు ప్రయత్నించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యక్తిగత సహాయకునిగా అవ తారమెత్తిన నాగు గన్‌మెన్ వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే పిఏని అని.. యూరియా లారీ కావాలని ఫోన్ చేశాడు. దాంతో లారీ యూరియా పంపేందుకు అధికారులు సిద్దమైనట్లు సమాచారం.
కాగా యూరియా డిమాండ్ మేరకు నెలకొంటున్న ఆందోళన సమస్యల వల్ల ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి యూరియాపై ఆరా కోసం అధికారులకు ఫోన్ చేయడంతో అసలు విషయంతో పాటు గన్‌మెన్ తతంగం మొత్తం బహిర్గత మైంది. దాంతో గన్ మెన్ పై ఎస్పీకి .. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
గన్‌మెన్ వ్యవహారంపై ఎస్పీ సీరియస్ :
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్ మెన్ నాగు నాయక్ వ్యవహారంపై నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసి విచారణ నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
MOST READ :









