తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
మిర్యాలగూడ : ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ..!
మిర్యాలగూడ : ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని తాళ్ళగడ్డ పందిర్లపల్లి చెరువుకట్ట ముత్యాలమ్మ తల్లి బోనాల మహోత్సవం, యాద్గరిపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులతో కలసి అమ్మవారికి బోనాలు సమర్పించి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, చిలుకూరి బాలు, శాగ జలంధర్ రెడ్డి, జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, బంటు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.











