Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం
Miryalaguda : మిర్యాలగూడలో విత్తన దుకాణాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ పట్టణంలోని వివిధ విత్తనాల దుకాణాలను శనివారం మండల వ్యవసాయ అధికారి ఋషయేంద్రమణి ఆకస్మికంగా తనిఖీ చేసారు.

Miryalaguda : మిర్యాలగూడలో విత్తన దుకాణాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని వివిధ విత్తనాల దుకాణాలను శనివారం మండల వ్యవసాయ అధికారి ఋషయేంద్రమణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. రైతుమిత్ర దుకాణం , చీదళ్ల అనంతరాములు అండ్ సన్స్ షాపు, యొద సీడ్స్ షాపులో ఉన్న వరి విత్తనాలు పరిశీలించారు.
ఆయా దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించిన 7 వరి రకాల విత్తనాలున్నాయి. వరి విత్తనాల శాంపిల్స్ సేకరించారు. వాటిని సీడ్స్ టెస్టింగ్ లేబరెటరికి పంపిస్తామని, ప్రభుత్వం సిఫార్సు చేసిన వరి విత్తనాలు అది కూడ ఎమ్మార్పికి విక్రయించాలని ఆదేశించారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పప్పవని హెచ్చరిక చేశారు.









