MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపోల్స్ లో తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారీగా వివరాలు ఇవీ..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ పోలింగ్ శాతం గతం కంటే తగ్గింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపోల్స్ లో తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారీగా వివరాలు ఇవీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పోలింగ్ స్టేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డు లుండగా 93,020 ఓటర్లు ఉన్నారు.
వారిలో 45,128 మంది పురుషులు, 47,878 మంది మహిళలు, 14 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. కాగా 77.44% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 34,098 మంది పురుషులు, 37,123 మంది మహిళలు, ఇతరులు 5 మంది మొత్తం 72,036 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
తగ్గిన పోలింగ్ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోలింగ్ శాతం గతం కంటే తగ్గింది. అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేసినప్పటికీ కూడా పట్టణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంలో వెనుకబడి ఉన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ మున్సిపాలిటీలో 79.31% పోలింగ్ కాగా ప్రస్తుతం 77.44% మాత్రమే పోలింగ్ జరిగింది.

MOST READ
-
Miryalaguda : మిర్యాలగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
-
MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో ఎస్పీ విస్తృత తనిఖీలు.. వెండి, మద్యం, చీరల పట్టివేత..!
-
ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!










