Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

Ration Cards : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల రేషన్ ఒకేసారి, ఎప్పటినుంచంటే..!

మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రేషన్ కార్డు దారులకు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా మేనేజర్ ఎల్. సుగుణ బాయి తెలిపారు.

Ration Cards : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల రేషన్ ఒకేసారి, ఎప్పటినుంచంటే..!

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి

మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రేషన్ కార్డు దారులకు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా మేనేజర్ ఎల్. సుగుణ బాయి తెలిపారు. జిల్లాకు సంబంధించి 6,45,442 రేషన్ కార్డులలో నమోదైన 22,17,063 లబ్దిదారులకు, ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున మూడు నెలలకు అవసరమైన మొత్తం 39,360,154 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

జిల్లాలోని 6 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా బియ్యాన్ని ఫెయిర్ ప్రైస్ షాపులకు సరఫరా చేసి, అక్కడి నుండి లబ్దిదారులకు సకాలంలో పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టబడ్డాయి. లబ్దిదారులు ఏప్రిల్ 1వ తేదీ నుండి తమకు సంబంధించిన ఫెయిర్ ప్రెస్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పొందవచ్చని తెలిపారు.

రేషన్ కార్డు, ఆధార్ వివరాలతో హాజరై బియ్యాన్ని సులభంగా పొందాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు అమలు చేయబడుతున్నాయి. అదేవిధంగా, ఎక్కడైనా అక్రమాలు, అదనపు వసూళ్లు లేదా ఇతర సమస్యలు తలెత్తిన పక్షంలో సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఒక ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు