Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకులు ఆకస్మిక తనిఖీ..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో వంట గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాల తీరును డీఎస్పీ రాజశేఖర్ రాజు ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ,రెవిన్యూ అధికారులతో కలసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.

Miryalaguda : మిర్యాలగూడలో గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకులు ఆకస్మిక తనిఖీ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ నియోజకవర్గంలో వంట గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాల తీరును డీఎస్పీ రాజశేఖర్ రాజు ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ,రెవిన్యూ అధికారులతో కలసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ఆయన పట్టణంలోని పలు గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం స్టాక్ రికార్డులను పరిశీలించారు. డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ సిబ్బంది, ఏజెన్సీ యజమానులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలో గ్యాస్ సరఫరా, పెట్రోల్ , డీజిల్ విక్రయాలలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను, గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు.

స్టాక్ పాయింట్ల వద్ద నిరంతరం నిల్వలు ఉండేలా చూసుకోవాలని, కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, నిత్యావసరాల కొరత సృష్టించాలని చూస్తే సహించేది లేదని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు