Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
మిర్యాలగూడలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దంద జోరుగా సాగుతుంది. సన్న బియ్యం కు బయటి మార్కెట్లో క్వింటా 6వేల రూపాయల నుంచి 7000 రూపాయల వరకు ధర పలుకుతుంది.

Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దంద జోరుగా సాగుతుంది. సన్న బియ్యం కు బయటి మార్కెట్లో క్వింటా 6వేల రూపాయల నుంచి 7000 రూపాయల వరకు ధర పలుకుతుంది. కాగా రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ముఠా దారులకు రీసైక్లింగ్ దందా సులభంగా మారింది.
రైస్ మిల్లులే అడ్డాగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి సన్నబియంగా విక్రయాలు చేపడుతున్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీసుల దాడుల్లో ఒక రైస్ మిల్లులో నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు మరింత లోతుగా పరిశీలన చేపడితే మరిన్ని మిల్లులో కూడా ఈ దందా బయటపడే అవకాశాలు ఉన్నాయి. రేషన్ దందా నిర్వహించే వారికి పెద్దల అండదండలు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మిర్యాలగూడ మండలంలో అక్రమంగా నిలువ ఉన్న పిడిఎస్ బియ్యంలో రూరల్ పోలీసులు పట్టుకొని నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతిపురం గ్రామ శివారులో శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్లు వద్ద అక్రమంగా పిడిఎఫ్ బియ్యం నిల్వ చేసినట్లు ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు. తనిఖీలలో భాగంగా పిడిఎఫ్ బియ్యం కొనుగోలు చేసి విల్లులో నిలువ చేసినట్లు వాటిని పాలిష్ చేయించి ఇతర బస్తాల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.
సుమారు 21 టన్నుల పిడిఎఫ్ బియ్యం 420 సంచుల లో నిల్వ ఉంచి తరలించడానికి సిద్ధంగా ఉండగా పట్టుకున్నారు. ఈ కేసు విషయంలో సోమ రామకృష్ణ, చిమ్మట వెంకన్న, చిమట లోకేష్, సయ్యద్ నదీమ్ లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
MOST READ
- రైతులకు శుభవార్త.. రూ. 27 చెల్లిస్తే చాలు 6000 ఆర్థిక భరోసా..!
- CM Revanth Reddy : మీరాలం ట్యాంకు వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్రేన్ పైకి ఎక్కి, ఓపెన్ టాప్ జీపులో..!
- ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..!
- CM Revanth Reddy : మీరాలం ట్యాంకు వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్రేన్ పైకి ఎక్కి, ఓపెన్ టాప్ జీపులో..!









