Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..

Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1వ తేదీన రాత్రి 8 గంటలకు మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) కిరాణా సామాను కోసం ఇంటి నుండి మోటార్ సైకిల్ పై వెళ్లి గ్రామంలోని కోదాడ ఒ జడ్చర్ల రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా మిర్యాలగూడ వైపు అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
దాంతో అతని తలకు బలమైన గాయాలు కావడం వల్ల మిర్యాలగూడలోని వర్షిత ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించారు. అనంతరం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మార్చి రెండవ తేదీన రాత్రి రెండు గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య పగడాల సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు.









