Miryalaguda : శిష్య పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య పాఠశాలలో సోమవారం సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా 100 మందికి పైగా వ్యవహరించారు.

Miryalaguda : శిష్య పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య పాఠశాలలో సోమవారం సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా 100 మందికి పైగా వ్యవహరించారు.

ముఖ్యమంత్రిగా లోకేష్, ఉపముఖ్యమంత్రిగా హారిక, ఆర్థిక మంత్రిగా మహిమ, హోం మంత్రిగా సౌమ్య, విద్యాశాఖ మంత్రిగా జెస్సి, ఎమ్మెల్యేగా వివేక్, కలెక్టర్‌గా చైత్ర, డీఈవోగా శ్రేష్ట, ఎంఈఓ గా కుశల, డైరెక్టర్ గా భవ్య శ్రీ, కరస్పాండెంట్ గా నేహా శ్రీ, ప్రిన్సిపాల్ గా మేఘన వ్యవహరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకునే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ శిరీష మాట్లాడుతూ విద్యార్థులు లుక్రమశిక్షణగా మెలగడానికి విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
MOST READ :
- District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి పిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకొవాలి..!
- NagarjunaSagar : బుద్ధవనం చేరుకున్న దమ్మయాత్ర.. ఘనంగా స్వాగతం..!
- రాజకీయాలకతీతంగా నీలగిరి నగరాభివృద్ధికి కృషి.. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో సైబీరియన్ అందాలు.. 30 ఏళ్లుగా ఆతిథ్యం ఇస్తున్న కొత్తగూడెం చెరువు..!