TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!

మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ మండలం జేత్యాతండా గ్రామములో బీసీ కాలనీ నుండి 35 సంవత్సరాలుగా ఉపయోగములో ఉన్న బాటను జేత్యా తండా వాసులు మూసి వేయటం జరిగింది. సోమవారం కాలనీవాసులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు.

ఆ బీ.సీ కాలనీలో 45 కుటుంబాల వాళ్ళకు ఆ దారి తప్ప వేరే మార్గము లేదు. ఆ 45 కుటుంబాలకు 1989 లో ఉమ్మడి దొండవారిగూడెం గ్రామానికి చెందిన వీరమళ్ళ సోమయ్య అను వ్యక్తి స్వచ్చందంగా ఇట్టి కాలనీ నిర్మాణం కొరుకు తన స్వంత పట్టా భూమిని సర్వే నెం: 444 గల భూమిని ప్రభుత్వమునకు ఉచితంగా దానం ఇవ్వటం జరిగింది. ఇట్టి స్థలములో ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వటంతో అప్పటి నుండి అక్కడనే నివసిస్తున్నారు.

కాగా జేత్యా తండా గ్రామ పంచాయతీ దొండవారిగూడెం నుండి 2018లో నూతన గ్రామ పంచాయతిగా ఏర్పాటు అయినది. అప్పటి నుండి ఈ దారిన జేత్యా తండా అవాసములోనే అంగన్ వాడి సెంటర్, గ్రామ పంచాయితీ ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీటికి ప్రధానమైన దారిన ఇప్పుడు ముళ్ళ కంపలు వేసి రాకపోకలు లేకుండా ఆపటం జరిగింది. కాలనీకి చుట్టు పంట పొలాలు ఉన్నవి.

గత 15 రోజుల నుండి అసందర్భంగా అట్టి బాటకు ముళ్ళ కంపలు వేయటం వల్ల కాలనీ నుంచి చదువుకునే పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా.. ఊరి వారు రోజు వారి రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. ముందు ముళ్ళ కంపలు వేసిన తర్వాత ఎమ్మార్వోని, ఆర్డీవో ని, డిఎస్పీని కలిసి సమస్యను వారి ధృష్టికి తీసుకెళ్ళే సమయములోనే అట్టి బాటను పూర్తిగా మూసి వేస్తూ గోడ నిర్మాణం చేపట్టడం జరిగింది.

కావున ఇట్టి విషయాన్ని తమరు ఒకసారి పరిశీలించి ఇట్టి బాటను పునరుద్దరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎం సి పీ ఐ నాయకులు వాసుకుల మట్టయ్య, పోతుగంటి కాశి, వసుకుల సైదమ్మ, గ్రామస్తులు చిర్ర మల్లేష్, కటికర్ల శ్రీను, ఎలకాని శ్రీను, దొండ నాగయ్య, నారాయణ, హరి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

Cm RevanthReddy : పరీక్షలు వాయిదా ఎందుకు వేయమంటున్నారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

మరిన్ని వార్తలు