Miryalaguda : అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు పట్టివేత..!
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లను బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

Miryalaguda : అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లను బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఆలగడప టోల్గేట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నేరేడుచర్ల వైపు నుండి మిర్యాలగూడ వైపు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు వచ్చాయి.
అనుమతి పత్రాలు అడిగినప్పటికీ వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో టిప్పర్ వాహనాల యజమానులు, డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి టిప్పర్లను స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా కాల్వపల్లి వైపు నుంచి మిర్యాలగూడ వైపు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లపై కేసులు నమోదు చేశారు. మిర్యాలగూడ మండలం పరిధిలో అక్రమంగా మట్టి ఇసుక తరలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు.
MOST READ :
- CM Revanth Reddy : ఐదు దశల్లో 10 అంశాలు.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమాలు..!
- Nalgonda : నల్గొండ జిల్లాలో హోలీ వేడుకల్లో తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు..!
- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టత..!
- Shankarpally : వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి శంకర్పల్లి బృంద నృత్యం..!









